చిత్ర కవిత
తేది : 01-01-2022
శీర్షిక :
సంసార నావ
కవిత సంఖ్య : 85+1
పల్లెపదాన ప్రతిపనికి రవాణాసాధనం
కర్ర తోని కచ్ఛురంగ కమనీపు ఇల్లు బోలు
నాగరికతకు ఆనవాలుగ నవీన సాధనం...
సాగిపోవు జీవితనౌక ముచ్చటై రమణీయంగా...
పైలా పచ్చీసే పైర గాలి ఊపులో ....
రయ్యిమంటూ పరుగుపెట్టే కొత్త జంట హుషారుగా
వెలుగు నీడల బంధమోలే వెలుగుతున్న మోముతో
వెయ్యేండ్ల కాపురానికి వెరవకుండా అడుగులేస్తూ .....
ఇరుసే ఇంధనంగా రెండు చక్రాలపైన నడుచు
కందెన శీలే కంచు కోట చక్రానికి రక్షణ ......
నొగండ్ల పొడిగింపుల్లో ఎద్దులు నిలుచు ముద్దుగా
కాని కనాలతోడ తోలు జోళ్ళ బందనాలు తోడవగా...
రెండెద్దులు తోడుంటే ఎదురులేదు పయనానికి....
రంకె వేసి రథంలా లెక్కెళ్తున్నాయి ......
జాతరైన యాత్రకైన జత కలిగి నడచు భువిపైన....
పచ్చని పైర్ల మధ్య పరువాల జంటకు ....
సంక్రాంతికి ఊరంతా పశువులకు పనిముట్లకు
సున్నం జాజులతో సుందరంగ రంగులన్నీ అద్ది
రంగు రంగుల కాగితాలతోడ రూపు రేఖలు మార్చి
అందమైన అలంకారాలతో ఆప్యాయతలను చాటెదరు.
రాముడని లక్ష్మణుడని ముద్దుపేర్లు ఎద్దులకు
దాపల రాముడుంటే వలుపల లక్ష్మణుడుండి
పరుగులిడుతూ పయనమంత పదిలపరుచేవి
సంసారపు నావ లాగ సక్కంగ లాగించు.....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment