చిత్ర కవిత
తేది: 25-01-2022
శీర్షిక : కాళిక
కవిత సంఖ్య 206
లాలనల లతా కుసుమం
ముఖ్యంగా అమ్మాయిల బాల్యం
ఆత్మీయతలు పంచే అమ్మతనం
ఆడవారికి మాత్రమే సొంతం ....
అందరికీ తెల్సిన పచ్చి నిజం
ఆడవారు లేకుంటే అధోగతేనని
అయినా మారదు ఈ లోకం
ఆగని అఘాయిత్యాల పర్వం ....
అమ్మగా చెల్లిగా ఆలిగా
అనునయింపులే కాదు సంపూర్ణం ...
అపార కాళిగా అవతారమెత్తయినా
అందిపుచ్చుకోవాలి స్వీయరక్షణలతో ...
రక్షణలీయాల్సిన ప్రభుత్వమే
రావణ కాష్టాలను పేరుస్తుంది
పరోక్షంగా పతనాలకు సుగమంగా
రాచ మార్గాలను పరుస్తున్నది ....
మత్తులో ... గమ్మతులో .....
మకిలి చేష్టల పాలకుల పథకాలు ...
చదువులతో విజ్ఞానాలివ్వకుండా
మత్తులతో ప్రభుత్వాల వ్యాపారం .....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment