మానస అలజడి
తేదీ 19-01-2022
శీర్షిక : స్థిత ప్రజ్ఞత ...
కవిత సంఖ్య : 202
మానసమంటేనే అనంత సాగరం
సుఖదుఃఖాలకు ... కష్టనష్టాలకు ...
కదిలిపోయే కల్లోల నిలయం ....
అలజడికి లోనవడం సహజం ....
మానసమొక విచిత్ర విహంగం
తప్పొప్పులను ఎత్తి చూపిస్తూ
ఆనందాలకు ఆసరాలనిచ్చి
దుఃఖాలకు నెలవవుతుంది....
రాగ ద్వేషాలతో రంజిల్లే మానసం
బంధాలకు దాసోహమంటుంది....
రాగం నిండితే కోరికలకు మూలమై
వ్యసనాలను వంటబట్టిస్తుంది....
ద్వేషం అసూయ క్రోధాలకు పుట్టిల్లు
బంధాలకు దాసోహమంటుంది....
రాగం నిండితే కోరికలకు మూలమై
వ్యసనాలను వంటబట్టిస్తుంది....
ద్వేషం అసూయ క్రోధాలకు పుట్టిల్లు
మనమున ఉద్భవించే త్రయోదశ రాగద్వేషాలు ...
తద్వారా ప్రస్ఫుటించే సప్తవ్ యసనాలయినా
పర తమ బేధాలు పాటించవు ...
రాజుపేదల తారతమ్యమెరగవు ....
గీత బోధనల అమృత సారం
నేటికి విశ్వజనీన ఆమోద పాత్రం
శరీరం ఇంద్రియాల ఆధీనం
ఇంద్రియాలు మనసుకు ఆధీనం
మనసు బుధ్ధికి అధీనం ,
బుధ్ధి ఆత్మకు అధీనం...
ఆత్మ సాక్షికి సవ్య సమాధానమే ముక్తికి మార్గం......
అందుకే వ్యసన విముక్తతే వినమ్రమైన మోక్షం....
వ్యసనాలకు బందీ అవుతే.... బద్దుడు....
వ్యసనాల నుండి బయటపడితే బుద్ధుడు ....
శరీరం ఇంద్రియాల ఆధీనం
ఇంద్రియాలు మనసుకు ఆధీనం
మనసు బుధ్ధికి అధీనం ,
బుధ్ధి ఆత్మకు అధీనం...
ఆత్మ సాక్షికి సవ్య సమాధానమే ముక్తికి మార్గం......
అందుకే వ్యసన విముక్తతే వినమ్రమైన మోక్షం....
వ్యసనాలకు బందీ అవుతే.... బద్దుడు....
వ్యసనాల నుండి బయటపడితే బుద్ధుడు ....
రామాయణ మహాభారతాలు
మానవాళికి మహాకావ్యాలే కాదు...
ఏమి చేయాలో ఎలా చేయాలో
ఏమి చేయకూడదో ఎలా చేయకూడదో
యుగాలు మారినా జగాన కరదీపికలై
ఎప్పటికప్పుడు విశదీకరిస్తున్నాయి ....
మానవాళికి మహాకావ్యాలే కాదు...
ఏమి చేయాలో ఎలా చేయాలో
ఏమి చేయకూడదో ఎలా చేయకూడదో
యుగాలు మారినా జగాన కరదీపికలై
ఎప్పటికప్పుడు విశదీకరిస్తున్నాయి ....
స్థితప్రజ్ఞతలే జీవన దివిటీలని ....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment