అంశం: లలిత గీతం
తేది: 08-01-2022
శీర్షిక: దివ్య తారక
కవిత సంఖ్య: 818
దిగి వచ్చింది దిగి వచ్చింది
దివ్య తారక ….
నగుమోముల….నవ్యనాయకా
మందారాల పుప్పోళ్ళను
మధురసాల మాధుర్యాలను
పుణికి పుచ్చుకున్నది
పుణ్యమూర్తి తానుగా ..... // దిగి//
కోయిలమ్మ రాగాలను
కుహూ కుహూ అంటూనే…
సెలయేటి గలగలలను
ఎదమీటి పాడినది…. // దిగి//
వెన్నెల్లో తానమాడి
చుక్కలన్నీ పొదువుకుని
చక్కనైన ముద్దుగుమ్మ
సక్కంగా వచ్చింది
చుక్కలా నిలిచింది ….. //దిగి //
నగునూరి రాజన్న
కరీంనగర్.
No comments:
Post a Comment