లలిత గేయం
తేది: 29-01-2022
శీర్షిక : కాలుష్యం
కవిత సంఖ్య : 834
మానవా ! ఓ మానవా !
స్వార్థ చింతను మానవా
సన్నుతించి నువు బ్రతకవా ...!
నిమిషమైనా నిలవదు
నీవులేక ఈ ప్రాణము ...
అయినా ఎందుకో
ఈ మనిషికింతా అహం ....
కాలుష్యాలకు కాలుదువ్వి
పురోగతులనే వల్లిస్తున్నాడు ...
ప్రాణ వాయువుల పచ్చడి చేసి
తోలు తిత్తిగ ఆడిస్తున్నడు ....
గంటలైనా గడవదు
నీవులేక ఈ జీవము ....
అనుభవైకము అయినను
మారకున్నడు మనిషి ఏలనో ....
జీవగంజిగ పేరుగాంచిన
మంచినీరు కరువు జేసిరి...
కలుషితాలు నింపుకుంటూ
కొనుచుంటిమి మనం తాగునీటిని ...
ఒక్క పూటను దాటలేము
ఒంటికింత తిండి లేక ....
అత్యావశ్యమని అందరెరిగి
ఆపకుండిరి కల్తీ కోరలను ....
పండు ఫలము ..కాయగూర
నిండు విషముల
విరజిమ్ముచుండె ....
ఒళ్ళు గుల్లలు అవుతుండగా
జేబు చిల్లులు పడుచుండెను ...
స్వీయ నియంత్రణ
చింత బాపు ...కొంత మేర
చిక్కులెన్నో ముడి విప్పగా ...
పాలకులు కూడా పదం కలిపితే ....
అధికారులంతా తోడు నిలిస్తే ....
అండదండల ప్రజలు నడిస్తే
చేయగలము .... కలుషితాలను
మనమంతము .... .. .
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment