Sunday, June 5, 2022

స్నేహ సమీరాలు -చిత్ర కవిత తేది : 17/18-12-2021

 స్నేహ సమీరాలు 

కవిత సంఖ్య:  83+1

పూట పూటకీ వేటలో మునిగి
పనిచేసి పస్తులు జయించు ... 
పడతుల ఆనందాల వదనం 
కోటి కాంతుల దేదీప్యమానం ... 

వెదురుతోనే పయనమయినా
ఇక ఎదురేముందంటూ ఫోజు… 
ముడతలతోనే ముసిముసి నవ్వులు
చిరు బాల్యపు చిందు విందులతో…. 

ధనిక పేదల దమన నీతులకు స్థానంలేని 
దమ్మున్న సామ్రాజ్యం దరహాసాల కోటంటూ…..
దవడలు జారిన దమయంతులు
దండి ఫోజులిచ్చి నిలిచె మన చిత్రకవితకు…. 

కర్ర ఊతమైనను… కల్మషములెరగని
నవ్వులతో… కదిలించి నిలిచె ప్రతి హృదయాన్ని
కళా తపస్వులై… కళాశ్రీ సాహితీ
వేదిక కదనరంగమునందున…. 

విల్లంబులు చేబూనిన వీరనారిలా….ఒకరుండ
చేత కెమెరాబూని చేవున్న ఛాయాగ్రాహకురాలిగ…మరొకరు… 
స్నేహ సమీరాలు నాటుతూ… మధురానుబూతులు మీటుతూ…
మానవతలకు మచ్చుతునకలై…. 

No comments:

Post a Comment