Saturday, June 4, 2022

మనసు పెట్టి వింటే తేదీ 15-12-2021 శీర్షిక : మౌనం కూడా ధ్యానమే…

 మనసు పెట్టి వింటే 

తేదీ 15-12-2021
శీర్షిక : మౌనం కూడా ధ్యానమే…. 
కవిత సంఖ్య : 808

మట్టి పాత్రల ప్రతిభాపాటవాలో 
కాల మార్పుల మహిమాన్వితాలో 
మట్టితో మమేకమైన మనిషికి 
మనసు కుసుమాలు విచుకున్నవి ... 
మమతల సడి చుట్టుకున్నవి ... ఒకనాడు 

వేల మైళ్ళ కొలదీ వేకువై దర్శించినదీ 
మలినములు లేకుండా మసలుకున్నది 
కాలుష్య కాసారాలుగా మిగల్చక 
మనిషి మనిషితో సంకర్షణమైనాడు ... 

మన ఉద్భవానికి సద్భావమైన 
ప్రకృతి పంచభూతాల గతిశీలనలలో కూడా 
గమకాలు మనకు నమకం చమకమే .... 
కర్ణ శ్రావ్యమైన కమనీయములే .... 

ఉదయాత్పూర్వపు భూపాళం 
ఊర పిచ్చుకల కువకువలు 
ఉషోదయపు వర్ణచిత్రాలు 
ఊసులు చెప్పే చల్లగాలులు .... 

మనసుపెట్టి వినగలిగితే 
మౌనంలో కూడా వినిపించే 
ధ్యానములే .... 
మనిషిలోని గుండె చప్పుళ్ళు… 


నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment