Thursday, July 9, 2020

బతుకు పంచాంగం 30-04-20

బతుకు పంచాంగం 
తేది: 30-04-2020
శీర్షిక : ఆనందో బ్రహ్మ
సంఖ్య: 407


నిరక్షరాస్యుని ముందున్న
నిఘంటువులా........
బ్రహ్మ రాసింది తెలియకపోయినా
జరిగింది జరుగుతున్నది జరగబోయేదే ఉన్నదని
ముందుకు సాగడమే బతుకు పంచాంగం .... 

మంచి చెడుల మతలబులా 
సుఖదుఃఖాల కలబోతలా
ఒడిదుడుకుల బండిలా... 
నిండి పోయేదే జీవిత పుస్తకం 

నచ్చిన గమ్యం నిర్దేశించుకుని 
నలుగురు మెచ్చే గమనంలో 
సమున్నతంగా నడక సాగించి
పయనించుటే మన జీవన పుస్తకం 

తెలియని కలి మర్మపు 
తికమకలకన్నా తెలుసుకునే 
కళ్ళముందుండి కదలాడుతున్న
కమ్మనైన బ్రతుకే సాక్షం... 

అందుబాటులో ఉన్న 
అనువైన అవకాశాలను 
అందిపుచ్చుకుని ఆనందంగా 
జీవించడమే ఆనందో బ్రహ్మ .... 

నగునూరి రాజన్న
హైదరాబాదు. 

No comments:

Post a Comment