మట్టి గూడు
అత్యవసరాలలో మూడవదైనా
తేది : 29-06-2020
శీర్షిక : మానవత్వాల ఆనవాళ్ళు...
సంఖ్య : 453
రాతి గుహల్లో రంజిల్లిన అనాగరీకం
రక్షణ వేటలో బయలుదేరి రెల్లు గడ్డి
తాటాకుల గుడిసెలో సేదదీరి
సుందర భవంతుల భ్రమల్లో ఊరేగుతుండగా...
ప్రకృతిలో పయనిస్తున్న మనిషికి
తుమ్మెదలు చూపిన బాటైనా
గిజిగాడు బోధించిన మట్టి గూడైనా
అందంగా మలుచుకున్న చల్లని నీడ....
రక్షణ వేటలో బయలుదేరి రెల్లు గడ్డి
తాటాకుల గుడిసెలో సేదదీరి
సుందర భవంతుల భ్రమల్లో ఊరేగుతుండగా...
ప్రకృతిలో పయనిస్తున్న మనిషికి
తుమ్మెదలు చూపిన బాటైనా
గిజిగాడు బోధించిన మట్టి గూడైనా
అందంగా మలుచుకున్న చల్లని నీడ....
అత్యవసరాలలో మూడవదైనా
ఆపద సంపదల్లో తోడుండేది
మనువు మొదలైనదే ఇక్కడే
మనిషి గుర్తింపుకు చిరునామా ...
సమ శీతోష్ణాల సంతులితలకు
సమూహ జీవనాలకు సాటియై
సంఘమై పల్లెలై పట్టణాలుగ
వెలసి పటాటోపాలు ప్రదర్శిస్తున్నది ......
మట్టి మాయమై గట్టితనమంటూ
సిమెంటు కాంక్రీటు జంగల్లకు బీజమేసి
ఆలవాలమై ఆకాశ హార్మ్యాలు వెలసి
మానవత్వపు ఆనవాళ్ళను మరచి
పోతున్న పావురం గూళ్ళు.....ఈనాటి ఇల్లు
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment