నవ్వి పోదురు గాక నాకేటి?
తేది: 26-05-2020
శీర్షిక: ప్రజా సంక్షామకులు....
సంఖ్య: 428
నీతి కలిగిన ధృడ సంకల్పం
నిజాయితీల చిరునామాలు
మచ్చుకైన కానరాని ముచ్చట్లు....
ప్రజా సమూహాల సంక్షేమాలను
ఫలహారాలుగా *నేడు* మార్చుకుని
ఫరడవిల్లుతున్న దళారి గణాలు....
అవినీతి అనకొండల ఆగడాలను
నిర్లజ్జ లంచగొండి కోడిపిల్లలను
నిర్భయపు కోడి రెక్కలతో కమ్మేస్తూ
ప్రజా రాజ్యాలను పరిహసిస్తున్నయి....
స్వార్థపు కొండచిలువలు కళ్లెం లేని
కల్తీల అశ్వమెక్కి సగటు మనిషి
ఆరోగ్యాలపై స్వారీ చేస్తున్నాయి...
కోన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న
కళేబరాలను కార్పొరేటు కబంధహస్తాల
తులసి తీర్థాలకై అప్పచెప్పుతున్న ఆనవాళ్లు....
మొదళ్ళను చెదల్లు తిన్న చందంగా
అధికార గణాలకు సైతం తలకెక్కిస్తూ
జనసామాన్యులను తైతక్కలాడిస్తున్న
వైనం .....
నవ్వితే నవ్వి పోదురు గాక నాకేటి?
అంటూ సిగ్గు బిడియము లజ్జలు వదిలి
ఇబ్బందులు లేకుండా డెబ్బదేండ్లనుండి
పాలు పితుక్కుంటున్న ప్రజా సంక్షామకులు....
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment