ఆషాడ మాసం ప్రత్యేక కవిత
25-06-2020
పూర్వాషాఢంలో శశి సంచారం
పుణికిపుచ్చుకును ఆషాఢమాసం
ఆధ్యాత్మికాలకు ఆలవాలం
ఆరోగ్యాలకు పెద్దరికం....
ఆచార సంప్రదాయలు
అగ్రశ్రేణి శాస్త్రీయత మనదేశాన
అడుగడుగున విడమర్చె కదా
అన్ని కోణాల మన జీవితాన ....
శుభకార్యాలకు సెలవులు
శూన్యమాసంగా సంప్రదాయం
శుచి శుభ్రతలకు పెద్దపీటతో
ఆధ్యాత్మికాలకు పట్టం ...
దక్షిణాయన శుభారంభం
జగన్నాథ రథయాత్ర విశ్వ విఖ్యాతం
విష్ణుమూర్తి శయన ఏకాదశి
జగన్నాథ రథయాత్ర విశ్వ విఖ్యాతం
విష్ణుమూర్తి శయన ఏకాదశి
విశష్టమైన తొలి పండగ ఈ నెలలోనే....
కొత్త నీటి జల కళలు
కొరత పడే ఆరోగ్యాలు
కొరత పడే ఆరోగ్యాలు
మడి ఆచారాల మతలబులు
అమ్మ బోనాల వేప సంప్రదాయాలు ...
అమ్మ బోనాల వేప సంప్రదాయాలు ...
ఎవుసంతో నిమిషం తీరికలేని
వ్యవసాయాధారిత భూమండలం
వ్యవసాయాధారిత భూమండలం
కొత్త పెళ్లి దంపతులకు సైతం
కొంత దూరాల నిర్ణయాలు....
కొంత దూరాల నిర్ణయాలు....
అనారోగ్యాల నెలవులైనందున
ఆషాఢ ఆంటీ బాక్టీరియల్స్
అతివలకు గోరంటాకుల సంరక్షణం
అందరికేమో చాతుర్మాస దీక్షల ఆరంభం....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment