అమ్మా నను కన్నందుకు....
తేది: 09-05-2020
శీర్షిక: ఏమిచ్చినా తీరని ఋణం...
సంఖ్య: 414
ఏ పూర్వ బంధమో
ఎన్ని జన్మల అనుబంధమో
నేను నీ కడుపున పుట్టడం
నన్ను కన్నా మాయమ్మా!
కడుపులో నేను కదిలితేనే
కమ్మగా నువ్వు ఊపిరి పీల్చుకుని
కంటికి రెప్పలా నన్ను కడుపులోన
తొమ్మిది నెలలు మోసినావె!
అహర్నిశలు నా ఆలనే
నా పాలనే నను పెంచంగా
అడుగడుగునా అంటిపెట్టుకుంటివే
పనులు ఒత్తిడి నీకెంత ఉన్నా....
పూట పూటకు తినిపించి
పూవులాగా పెంచినావు
మాటి మాటికీ మాటలెన్నో వల్లించి
మాటలన్నీ నేర్పించి
మనిషిని నను చేసినావు....
నా చిన్ని చేతులను
నలగకుండా నడిపించ
అడుగులోన అడుగులేస్తూ
అడుగులేయ నేర్పిస్తివే ...
అక్షరాలు నేర్పించంగ
అపర సరస్వతివైతివి
అండదండలుగ చేసి
ఆజన్మాంతము సుఖము
కోరితివి....
ఎక్కములు లెక్కింప
ఎన్ని ఇబ్బందులో
ఏపూటకాపూట
వల్లింప జేసితివి ...
అమ్మా ఏమిచ్చినా
తీరని ఋణం... నీది!
అవసాన దశలోన
ఆసరాగ ఉండడం తప్ప.....!
నగునూరి రాజన్న
హైదరాబాదు.
No comments:
Post a Comment