నీతో ఒక సుదీర్ఘ సంభాషణ(2)
తేది: 05-06-2020
శీర్షిక: ఉనికినే కోల్పోతున్నాడు .......
సంఖ్య: 436
చక్రం పనిముట్లు చేతికి రాగానే
చుక్కలు చూపించిన మానవుడు
నగారా మోగించి నాగరికతన్నాడు
నడకలు నేర్చుకుని నగుబాటగుతున్నాడు
ప్రతి అడుగులోను ప్రగతి అంటూ
ప్రకృతినే దునుమాడుతున్నాడు....అరణ్యాలన్ని అలవోకగా నరికేసి
అన్న పానీయాలు వెదుక్కుంటున్నడు
వాగు వంకలు నదులన్నీ జల్లెడేసి
వాటమైన భవంతులు ఆకాశ హార్మ్యాలన్నాడు
వాగు వంకలు నదులన్నీ జల్లెడేసి
వాటమైన భవంతులు ఆకాశ హార్మ్యాలన్నాడు
సాగునీటికి సాగిలపడుతున్నడు
తాగునీటికి కటకటలాడుతున్నడు....
భూగర్భాన్ని చీల్చి చెండాడి
భువిన వెలుగుల నింపుతున్నాడు
పరిశ్రమలంటూ పరుగులు పెట్టి
ప్రాణవాయువునే పరిహసిస్తున్నాడు....
స్వార్థచింతనలు తలకెత్తుకుని
సాటిమనిషినే మరిచిపోయాడు
డబ్బు యావలో జేరి జబ్బు పడ్డాడు
కన్నవారినే మరిచి కసాయిగా మారాడు....
అధికార మదాలను తలకెక్కించుకుని
అధోగతి పాలవుతున్నాడు
కలిమాయల పాలబడి కపటత్వం
ఒంటబట్టించుకుంటున్నడు
ఉచ్ఛనీచములు మరిచి సాంతంగా
ఉనికినే కోల్పోతున్నాడు .......
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment