నగునూరి రాజన్న
కరోనా ప్రకృతికి వైద్యం
కష్టకాలం తెచ్చింది కదాని
కరోనా కళ్ళల్లో కారం కొట్టాలనుకున్నా!
కానీ... దశాబ్దాలుగా దగాపడిన
కాలుష్యాలను కడతేర్చినది!
కలుషితం లేని హస్తమైనా సరే
కల్సుకోక చాన్నాళ్ళైంది కదాని
కలుసుకున్న ఆత్మీయ నేస్తానికి
కరచాలనం కన్న నమస్కారం మేలన్నది!
రహదారులన్నీ రాచమార్గల్లా
రద్దీలేకుండా ముద్దొస్తూంటే
రణగొణ ధ్వనుల శబ్దకాలుష్య
రక్కసిని నిశ్శబ్దంగా చేదించింది!
పర్యావరణం ప్రశాంతమై
స్వచ్ఛమైన వేళ...సంబరాలు
తీర్చుకుందామంటే ముక్కుకు
మూతికి ముసుగు వేసుకోమంటుంది !
జవసత్వాలుడుగుతున్న పట్టణ
పర్యావరణానికి జనసంచారం
తగ్గి ఔషధమే అయ్యింది
ప్రకృతంతా పచ్చదనమై
పట్టణాలన్నీ పల్లె సోయగాలై
ప్రాణవాయువును పరిశుద్ధపరిచి
శబ్దకాలుష్యం లబ్దపరిచి
ఓజోను మరమ్మతుతో
ప్రకృతికే వైద్యం చేసింది
కరోనా లాక్ డౌన్ ......
నగునూరి రాజన్న
No comments:
Post a Comment