Sunday, July 12, 2020

కార్మిక గీతం తేది: 27-06-2020

కార్మిక గీతం 
తేది: 27-06-2020
శీర్షిక: కష్టాలకు మేమె అడ్డ్రసులం... 
సంఖ్య : 452 

కార్మికులం శ్రామికులం 
కష్టాలకు మేమె అడ్డ్రసులం 

చక్రం పనిముట్లయినా 
సుత్తే కొడవండ్లయినా 
చిత్తు బొత్తులే మా జీవితం ...  //శ్రామి//

తరాల సమయం దాటినా 
యుగాల కాలం గడిచినా 
వెతలు నిండిన తలరాతలే....   //శ్రామి//


పేర్లు మారిన రాజ్యాలు 
పెత్తనం మారిన భోజ్యాలు 
పెనుగులాడుతున్న మా జీవితాలు  //శ్రామి//

దినసరి లో కూలోల్లం
నెలసరిలో ఉద్యోగులం  
పిసరంతా మారని మా జీవితం //శ్రామి//

పరిశ్రమల  రొదలయినా   
సాఫ్ట్ వేరు  గదులైనా 
అడుగడుగున మా నీడలే ... //శ్రామి//

ఉత్పత్తిలోన ఉత్పాదకతల్లోన 
ఊతమే మేము జాతికెప్పుడు 
అయినా పట్టదు మా గోడు.    //శ్రామి//

కష్టాలను భరించే కార్మికులం 
సుఖాలను పంచే మనసున్నోల్లం
నష్టాలను పూరించే కష్టజీవులం //శ్రామి//

నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment