Sunday, July 12, 2020

నేను పుస్తకమై పుడతా తేది : 23-06-2020

నేను పుస్తకమై పుడతా
తేది : 23-06-2020
పరోపకారం....
సంఖ్య : 448

జీవ చక్ర పరిభ్రమణంలో
బ్రహ్మ కనికరిస్తే జీవంలేని
హస్త భూషణమైనా జీవితాంతం
వెలుగు కిరణాలు ప్రసరిస్తూ
మానవాళికి మార్గదర్శనం చేస్తా ...!

పరిమళ భరితమైన అక్షర
కుసుమాలు నింపుకుని
అనంత భావాలు పొదువుకున్న
పూదోటనై ప్రతి బాటసారిని పలుకరిస్తా ! 

గడచిన ధీర చరితలను
కళ్ళకు కట్టినట్టు చిత్రించుకుని
కుతూహలాలు నిండిన
కొత్త పాఠకులకు నిత్య నూతన
తేజాలనిస్తా !

అజ్ఞాన తిమిరాలను పారద్రోల
అనంత విజ్ఞాన భాండాగారాలకు
ఆలవాలమై అనుక్షణం కదన
రంగ సైనికున్నయి కాచుకుంటాను!

పరోపకారమిదం శరీరం కన్నా
పావనమైనదేమున్నది... కోరుకునేది
చరాచర ప్రపంచములో ఇంక
పొందేది ఏముంటుంది... ధన్యోస్మి...! 


నగునూరి రాజన్న
కరినగరము 

No comments:

Post a Comment