Sunday, July 12, 2020

అద్దం ముందు కాసేపు 02-06-2020

అద్దం ముందు కాసేపు
తేది: 02-06-2020
శీర్షిక: స్వర్గమే తలపించదా! 
సంఖ్య: 433

అద్దం ముందు కాసేపు నిలబడితే 
ఆత్మ సాక్షాత్కారం స్ఫురిస్తుంది... 

ఆమ్మో! అద్దమంటే భయం 
నిప్పులాంటి నిజాలనే పలకమంటుంది! 
కష్టమైనా సరే నిజాలనే
వినమంటూ బోధిస్తుంది!

నిష్ఠూరాలను సహిస్తూనైనా
అంతా నిజమే చేయమంటుంది! 
కలి కాలపు నీడలలో కూడా
అంతా నిజమే చూడమంటుంది !

అయినా పిచ్చి గానీ నన్ను మాత్రమే నిలదీస్తే 
ప్రపంచం పదిలమవుతుందా?  
ఒక్క నన్ను వినిపిస్తేనే
సమస్తం సుఖపడుతుందా? 

నీళ్లలా నిర్మలమైతే సరిపోతుందా?
నాలాంటివారిని నచ్చపలికిస్తావేమో.... 
మంచి చెప్పి మరిచిపోతే సరిపోతుందా?  
మంచి నడవడికలకు నాందీ పలకాలి ... 

ఒక్కసారి ధైర్యం చేసి చూడు
పలకరించి పల్లవించు పవనాలను
తెల్ల ఖద్దరు పంచె కండువాలను.... 
యథా రాజ తథా ప్రజలై అన్నీ
సర్దుకుని స్వర్గాన్ని తలపించదా.... ! 

నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment