Sunday, July 12, 2020

పచ్చదనం జీవమని 06-06-2020

పర్యావరణం
తేది: 06-06-2020
శీర్షిక: పచ్చదనం జీవమని
సంఖ్య: 437


పాడవోయి మానవుడా 
పచ్చదనం జీవమని //

మరకతంగా మెరిసిన
మణి గర్భిత భూమాతను
మసిబూసిన మారేడుగ
చేయనే చేయొద్దని //  పాడ//

చక్రం పనిముట్లతో
చలనమైన నాగరికత
చెట్లు చేమలు నరకవద్దని
చరమ గీతం పాడవద్దని //పాడ//

కొండ కోనలు పిండి చేస్తే
మండుటెండలు మాడ్చునని
వానచినుకులు కరువులయితే
నీటిమట్టములింకునని  //పాడ//

ప్రకృతంటే శ్రేష్టమని 
పంచభూతములను
పొదుపుగా వాడమని
ముందుతరం హక్కులని //పాడ//

పాడవోయి మానవుడా 
పచ్చదనం జీవమని //

నగునూరి రాజన్న


కరినగరము 

No comments:

Post a Comment