Thursday, July 9, 2020

సుధారసం తేదీ : 19 -05 -2020

సుధారసం 
తేదీ : 19 -05 -2020 
శీర్షిక : సుగమ జీవన పథం...
సంఖ్య : 422 

ముచ్చటగా విన్న చిన్ననాటి 
మూడు చేపల కథే కదా 
ముదముగ అవగతమౌతే  
మనిషి జీవితం సుగమ జీవన పథం.... 

ఆటవికతలను ఆవలకు నెట్టి 
అత్యవసరాలను అవపోసనపట్టి 
అవసరాలను అధిగమించి మించి
విలాసాల రమిస్తున్న వింత జీవి.... 

అలసత్వాలు అందిపుచ్చుకుని 
అందులోనే జీవితముందనుకుని
అక్కడక్కడే తారాడుతూ పొర్లాడుతూ
అమరత్వం పొందాలనే ఆరాటం .... 

కిక్కులోనే గమ్మత్తుందని బుక్క బుక్కలో 
వెదుక్కుంటూ గంభనంగా తచ్చాడుతూ
చిక్కుల్లోకి వెళతాడు భ్రమల్లోనే 
బతుకుతాడు బడబాగ్నుల తేలి ఆడతాడు... 

స్వార్థ గుర్రాల స్వైర విహారం చేసే 
సంకుచిత పాలకులకు సమయమేది ? 
స్థిర చిత్తాల స్ఫురణల పదును కావాలి  
సజ్జనుల మాట సగటు జీవిని అక్కున చేర్చుకుని 
సద్బుద్ధుల మార్గాన సంగమింప... 

నగునూరి రాజన్న

No comments:

Post a Comment