పి వి నరసింహారావు
తేది: 28-06-2020
శతజయంతి ...
పాములపర్తి వారి పండంటి బిడ్డ
వరంగల్ జిల్లా వారి ముద్దుబిడ్డ
కరీంనగర్ జిల్లా వారి కాంతిరేఖ
వీర తెలంగాణాకే మచ్చుతునక....
వరంగల్ జిల్లా వారి ముద్దుబిడ్డ
కరీంనగర్ జిల్లా వారి కాంతిరేఖ
వీర తెలంగాణాకే మచ్చుతునక....
లక్నేపల్లి పుట్టినా... వంగర లో పెరిగినా...
లక్ష్యం చేరుకున్న విలక్షణ రాజకీయవేత్త
విదుర నీతుల సంతులత భావశీలి....
వర్గం లేని వంగర వాసి
స్వర్గతుల్య పాలనలందించె
అపర చరకుడై చికిత్స చేసాడు
ఆర్థిక రంగ ఋగ్మతకు భారతాన
లక్ష్యం చేరుకున్న విలక్షణ రాజకీయవేత్త
విదుర నీతుల సంతులత భావశీలి....
వర్గం లేని వంగర వాసి
స్వర్గతుల్య పాలనలందించె
అపర చరకుడై చికిత్స చేసాడు
ఆర్థిక రంగ ఋగ్మతకు భారతాన
పలు భాషల ప్రవీణుడు సహస్ర ఫణీంద్రుడు
ప్రథమ భూసంస్కరణల సామాజికవేత్త
నవోదయ పాఠశాలల సంఘ సంస్కర్త
సంకీర్ణ ప్రభుత్వపు సంయమనశీలి
ప్రథమ భూసంస్కరణల సామాజికవేత్త
నవోదయ పాఠశాలల సంఘ సంస్కర్త
సంకీర్ణ ప్రభుత్వపు సంయమనశీలి
పాములపర్తిని పొదువుకున్న
పదుగురి క్షేమం కోరుకున్న ప్రజ్ఞాశాలి
ప్రజల మనిషిగా నిలిచిన
ప్రధానమంత్రి మన తెలుగు తేజం ....
పదుగురి క్షేమం కోరుకున్న ప్రజ్ఞాశాలి
ప్రజల మనిషిగా నిలిచిన
ప్రధానమంత్రి మన తెలుగు తేజం ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment