దీప ఖడ్గం
తేది: 28-05-2020
శీర్షిక: విజ్ఞాన జ్యోతులు
సంఖ్య: 430
బంగారు బాల్యాన అమ్మ
లాలనలే ఆనంద జ్యోతులు...
గురువు బోధనలే గురుతర
జీవిత మార్గదర్శకాలు.....
తిమిర మేఘముల చీల్చి
చెండాడే మెరుపు కాంతి
రేఖలా అజ్ఞానంధకారాన్ని
చేధించే ఆయుధమే
అమేయమైన అక్షరజ్ఞానం....
అక్షర జ్ఞానంతో అలవర్చుకున్న
వివేచనా విజ్ఞానమే తోడుండగా
అంధకారాల చీకట్లను పారద్రోలే
అక్షయ తూణీరమౌతుంది.....
కపట స్వార్ధపు కటిక చీకట్లను
కళ్ళల్లో నింపుకుని అక్షర జ్ఞానపు
ఆరోగ్యాల హక్కులను అమ్ముకుంటూ
అందరికి అందకుండా జాగ్రత్త పడుతున్న
శిఖండుల భరతంపట్టి
ప్రశ్నించగలిగే పత్రికా రంగమే
ప్రశస్తమైన కాంతికిరణం....
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment