జయహో జయశంకరా !
జయహో జయశంకరా
జయ జయహో జయ శంకరాతల్లడిల్లిన తెలంగాణకు
తనువంతా అర్పించావు !
మహాలక్ష్మమ్మ నోములపంటైన
మనసున్న లక్ష్మీకాంతరావు తనయుడవు
అక్కన్నపేటవారి ముద్దుబిడ్డవు
ఆత్మకూరు మండలం ఆత్మీయుడవు !
సత్తా చాటిన నాయకుడవై
సాంబారిడ్లీ గో బ్యాకన్నావు
ఆంధ్రాలో మనల్ని కలిపేస్తుంటే
అడ్డు చెప్పి పోరాడినావు !
అడుగడుగున కష్టాలు చూసి
ఆజన్మ బ్రహ్మచారివయ్యావు
అనుక్షణం తెలంగాణ శ్వాసించి
అర్హులకు అవపోశన పట్టావు !
నీళ్లు నిధులు నియమాకాలకై
నిర్విరామంగా కృషి చేసావు
నీ ఆస్తిని అస్తిత్వాన్ని అప్పగించిన
అంకితమూర్తివి నీవయ్యా !
ఆజన్మ బ్రహ్మచారివయ్యావు
అనుక్షణం తెలంగాణ శ్వాసించి
అర్హులకు అవపోశన పట్టావు !
నీళ్లు నిధులు నియమాకాలకై
నిర్విరామంగా కృషి చేసావు
నీ ఆస్తిని అస్తిత్వాన్ని అప్పగించిన
అంకితమూర్తివి నీవయ్యా !
ఊహలన్నీ బిగపట్టుకుని
ఉద్యమానికి ఊపిరై నిలిచావు
యువతకు ఊతమైనావు
మేధావులకు ఆలోచనవయ్యావు!
శ్వాసించిన తెలంగాణ
శరత్ చంద్రికై నిలిచింది
శతకోటి వందనాలు
తెలంగాణ సూరీడా !
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment