సిపాయి హృదయం
తేది : 30-06-2020
శీర్షిక : భిన్నత్వంలో ఏకత్వం....
సంఖ్య : 454
కోటానుకోట్ల జన పరిచయమే
కోరి నిలిచిన సిపాయి హృదయం
అసమదీయుల ఆత్మ రక్షణం
తసమదీయుల ఆటలు కట్టించ.....
తేది : 30-06-2020
శీర్షిక : భిన్నత్వంలో ఏకత్వం....
సంఖ్య : 454
కన్న తల్లిదండ్రులు
కట్టుకున్న ఇల్లాలు
కనిపెంచిన పిల్లలు
కళ్ళలో కదిలినా ఒక్క క్షణం...
తనువంతా నిండిన
ఆణువణువూ దేశ ప్రజలే
అహరహరం....
కోటానుకోట్ల జన పరిచయమే
కోరి నిలిచిన సిపాయి హృదయం
అసమదీయుల ఆత్మ రక్షణం
తసమదీయుల ఆటలు కట్టించ.....
సిపాయి హృదయం సింధూరారుణం
కణ కణ మండే కాగడా శతృ మూకల
దునుమాడే శతఘ్నుల గోళం....
ప్రజా సంక్షేమమే పండుగలు
పబ్బాలుగా చేసుకుని
మంచు కొండలనే గుడి గంటలుగా
మలుచుకుని సరిహద్దులే ఊపిరిగా ....
కులమతాలకతీతమై
భాషా భావాలకు అందని
భిన్నత్వంలో ఏకత్వం....
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment