అంశం :*గీతాంజలి/రవీంద్రుడు*
తేది 07-05-2020
శీర్షిక: విశ్వ కవి
సంఖ్య: 412
పదునాల్గవ బిడ్డడయినా
ప్రపంచ స్థాయిలో ఫరిడవిల్లాడు...
బాల్యంలోనే నటన భాషపై పట్టుతో
పన్నెండవ ఏటనే రచనకు పదును పెట్టాడు .....
అలుపెరుగని ప్రయాణాలు
అపారమైన విషయ పరిజ్ఞానం
ఆసియాలోనే ప్రథమనోబెల్
బహుమతి సాధించిన విశ్వకవి... !
జనగణమనతో జాతీయతకు
ప్రాణంపోసిన జన జాగృతుడు
గోరాతో మతసామరస్యతకు
మచ్చుతునకయిన ప్రజ్ఞాశాలి!
పిల్లలపై ప్రేమలు నింపుకున్న
శాంతినికేతన మార్గదర్శి
గ్రామాభ్యుదయానికి శ్రీనికేతన్
నెలకొల్పిన ధీశాలి ...!
సంగీతాన్ని ఆస్వాదిస్తూనే
రచన నటన చిత్రకళ లలో
ఆరితేరుతూ శ్రమ విలువల
తూకంలో అసామాన్యుడయ్యాడు...!
మానవసంబంధాలలోన
మమతల పందిర్లు అల్లి
మాతృభూమి ప్రేమలో
తలమునకలయ్యాడు.... !
నగునూరి రాజన్న
హైదరాబాదు.
No comments:
Post a Comment