Sunday, July 12, 2020

అన్నదాత హృదయం తేది :03-07-2020

అన్నదాత హృదయం
తేది :03-07-2020
శీర్షిక : అన్నదాత హృదయం ఆదిత్యం..  
సంఖ్య : 457

ఆరుగాలం తపస్సే 
అరకదున్నే రైతన్న జపం 
నూటముప్పై కోట్ల జనానికు
ముప్పూటలా కడుపు నింపు నిత్యం 

సుశుప్త చేతనల వస్తువైనా
సప్తవర్ణ శోభలను మూటకట్టుకున్న
పారిశ్రామిక ఉత్పత్తుల్లో పట్టున్న
పెట్టుబడిదారు ధర నిర్ణయం.... 

కళ్ళల్లో ఒత్తులేసుకుని
కాలానికి  ఎదురీదినా 
పంటల ధరల్లో మాత్రం
హాలికునికి దక్కని అధికారం.... 

ఋతువుకు ఋతువుకు 
బతుకు వెదుక్కునే ఆశావాది  
బతుకు బతుక్కు 
మెతుకు అందించే మేధావి ... 



మాటవరసకు మంచిచెడుల వాకబుకు 
స్వంత వారికే సమయం లేకున్నా 
తమ పర భేధమెరుగని తపోధనుడు
అనంత విశ్వజనులకు అన్నదాత..... 
అన్నదాత హృదయం ఆదిత్యం 

నగునూరి రాజన్న
కరినగరము. 


No comments:

Post a Comment