చిత్ర కవిత-1
06-07-2020
నగునూరి రాజన్న
శీర్షిక: ఎలా కరుణిస్తుంది ఓ మనిషి ..... ?
8332963129
పచ్చపచ్చని శోభలతో
పరిమళించిన భూగోళం
ప్రకృతి రమణీయతలతో
ఫరడవిల్లిన పుణ్యభూమి ....
మరకతమై శోభించే
మౌనంగా ప్రకాశించే
మానవాళితో కూడిన జీవరాశికి
మార్గమై నిలిచె నాడు....
అనాలోచిత స్వార్థాలను
అమేయమైన భుజకీర్తులుగా
అంటగట్టుకున్న మానవుడు
అడువులన్ని నరికి పుడమి
రంగు మార్చుతుండె...
కలుషితాల కడగండ్లకు
కుంచించుకున్న పత్రహరితం
లజ్జతో మరుగుజ్జయి మజ్జుగా మారి
నిస్తేజంగా భూమి పొరల్లోనే
తిరోగమనమౌతున్నది .......
కరుణ తెలియని గొడ్డలిని
కర్కశముగ చేతబూని
ఆధునికతల పోకడలతో
మోడులపై నిలిచి అందమైన
కలలు కంటె పచ్చదనం ఎలా
కరుణిస్తుంది ఓ మనిషి ..... ?
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment