ఉన్నది ఒక్కటే జీవితం
తేది: 16-06-2020
శీర్షిక : సృష్టి రహస్యం...
సంఖ్య: 443
భూమి గుండ్రమన్నంత సత్యం
చీకటి వెనకే వెలుగు కుసుమం
కష్టాల కడగండ్ల వెనకే సుఖం
రాజసాల.... సృష్టి రహస్యం....
మన చేతిలో మన జీవితం
మలుచుకుంటే మలబారు తీరం
చీకటి వెనకే వెలుగు కుసుమం
కష్టాల కడగండ్ల వెనకే సుఖం
రాజసాల.... సృష్టి రహస్యం....
మన చేతిలో మన జీవితం
మలుచుకుంటే మలబారు తీరం
రత్న మాణిక్యాల రసామృతం
సృష్టించుకోవచ్చు విశిష్టమైన చరిత్రం....
సృష్టించుకోవచ్చు విశిష్టమైన చరిత్రం....
ముందు వెనకల జీవనాల గమనం
గమ్యం ఎండమావిలా ఆగమ్య గోచరం
విజ్ఞుల బోధనలే వినమ్రమైన శరణ్యం
గమ్యం ఎండమావిలా ఆగమ్య గోచరం
విజ్ఞుల బోధనలే వినమ్రమైన శరణ్యం
వేనవేల కోట్ల జీవరాశుల సమాహారం....
ఆరుగాలం కష్టపడ్డ రైతు పంట
అయాచితంగాఎదుటి మనిషి చేతిలో
పెట్టి విలువెంతంటే వీలయినంత
అన్నట్టు కనీస మద్దతు ధర కూడ
హుళక్కే........ మన జీవితం.....
వివేచనా విశదీకరణాలతో
ఎప్పటికప్పుడు ఏరుకుంటూ
మంచిని మాత్రమే పొదువుకుంటూ
ముందుకు సాగడమే విజ్ఞత.
ఎప్పటికప్పుడు ఏరుకుంటూ
మంచిని మాత్రమే పొదువుకుంటూ
ముందుకు సాగడమే విజ్ఞత.
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment