Sunday, July 12, 2020

అనుమానానికి ఆవలి తీరం-03-06-2020

అనుమానానికి ఆవలి తీరం 
తేది-03-06-2020
శీర్షిక: కడిగిన ముత్యం.... 
సంఖ్య: 434

స్వార్థాల మత్తులు తలకెక్కితే 
మస్తిష్కానికి మలినాలల్లుకుంటాయి... 
మంచి చెడుల వలువలు వదిలి 
మానవతా విలువలకు పాతరే గతి.... 

ఆధారంలేని భయాల చీకట్లలో 
అంతరంగపు కాన్వాసు కానరాక
బతుకుదారుల గమ్యం తెలియక 
అనాలోచితాల ఊతాలకు వేళ్ళాడుతూ 
అనుమాన బీజాలకు పుట్టినిళ్లవుతుంది.... 

అవకతవక నడవడికలకు 
ఆలవాలమై అడగకుండానే 
అరువు తెచ్చుకున్న ఆలోచనలతో 
అహాలను పెంచి పోషిస్తుంది .... 

మనిషి జీవితం మాయామోహితం 
తెల్సినా బయటపడనీయదు అహం 
ఒక్కసారి జూలు విదల్చి బయటపడితే 
నిక్కముగా నిలబడి అంతరంగం ఆవిష్కరిస్తే... 

గాలికి నిండిన మబ్బుల్లా
వేడికి వర్షించిన వాతావరణంలా
ఆహ్లాదం చిగురించిన ఆనందంలా 
కడిగిన ముత్యమై కమనీయంగా 
మెరవదా..... 

నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment