Thursday, July 9, 2020

కరోనా వైద్యులు : 06-05-2020

కరోనా వైద్యులు 
తేదీ 06-05-2020
శీర్షిక : వైద్యానికి వెలుగులు 
సంఖ్య : 411 

మనిషికి రోగమొస్తే ...
రోగం నొప్పీ లేని మనిషి  
ఆలు బిడ్డలను అమ్మానాన్నలను 
అన్నీ వదులుకున్న ఆపద్భాంధవులు 
వైద్యులు....  
  
రోగులకు కునుకు కరువుయితే ....  
అనుక్షణం వారిని  కాచుకునే 
అపర నారాయణులైన వైద్యులకు 
ఆసుపత్రి పైకప్పులే 
అల వైకుంఠపురమైన చందం ..... 
    
ఒక్కరికి కరోనా సోకినా 
ఇంటిల్లిపాది నరకం  ... 
వందల రోగుల మధ్య వదలని 
ధన్వంతరీ వారసుల సేవలకు  
వారి ఇంటిల్లిపాది అనుక్షణం బిక్కు బిక్కు ...  

అంటురోగంతో రోగులు 
తంటాలు పడుతుంటే.....  
అవ్వ బువ్వలు వాళ్ళే ఇచ్చి 
సళ్ళ నీళ్లు వాళ్ళే పోసి 
అన్నీ అమర్చి అమ్మానాన్నలైనారు .... 

ఒంటరైన వందల రోగులకు 
ఒంటి చేయితో సేవలందిస్తూ 
మాట మంతికి మనిషి కరువైతే  
మాటవరసకు బంధువయ్యాడు ....   

బిక్కు బిక్కు మంటున్న 
బతుకులకు ఆశాదీపం  
ఉక్కు సంకల్పాలతో 
కత్తి లేకనే కవాతు చేస్తున్నాడు.... 

ధన్వంతరీ వారసులైన 
ధవళకాంతి ప్రాణదాతలు 
అతుక్కునే చూపులు.... 








No comments:

Post a Comment