Sunday, July 12, 2020

నేనెవరినో నాకే తెలియదు తేది : 18-06-2020

నేనెవరినో నాకే తెలియదు
తేది : 18-06-2020
శీర్షిక : మధ్యతరగతి అతి సామాన్యున్ని...
సంఖ్య : 445

పచ్చ పచ్చని ప్రకృతి ఒడిన
పటాటోపం తెలియని పల్లెనీడన
ఫరిడవిల్లిన పసితనపు బాల్యం 
పరిపక్వత తెలియని తత్వం.... 

అమ్మా నాన్నల అండదండలమయం
ఆత్మీయంగా అందించిన ఆశీర్వాదం
ఆహరహం శ్రమించిన పట్టుదల
అక్షరాస్యత అందించిన పూర్ణత్వం..... 

అయినా మధ్య తరగతి జీవనం 
హద్దులేర్పరిచిన సుద్దుల మయం 
అజమాయిషీలు ఆంక్షల బందీగా 
స్వేచ్ఛను మరిచిన విహంగాన్నయ్యా.... 

వినయ విధేయతల ముద్రితం 
నమ్ముకున్న బంధనాల అల్లికలతో 
ఇష్టాయిష్టలకు తగిలించిన తాళం 
ప్రశ్నించగలననే నా వ్యక్తిత్వాన్నే మరిచా..... 

ప్రతిక్షణం కళ్ళముందు జరిగే అక్రమాలను
పదే పదే జరిగే అవినీతి జాడలను
పక్కవాడి అన్యాయాల కుటిల నీతులను
మంచి చెడుల మతలబులు ప్రశ్నించలేని 
మధ్యతరగతి అతి సామాన్యున్నయ్యా!  

పక్కాగా కలిగిన పౌరసత్వం.... 
అయినా అప్పుడప్పుడు 
ఆత్మ సాక్షిని వదిలివేస్తున్న వైనం 
నేనెవరినో నాకే తెలియదు..... 


నగునూరి రాజన్న


కరినగరము. 

No comments:

Post a Comment