అన్నమయ్య జయంతి.
తాళ్లపాక వారిల్లు తరించగా
నారాయణహరి లక్కమాంబలకు
నారాయణుడి నందక అంశజుడు
అపురూప వరపుత్రుడు అన్నమయ్య !
చందమామ రావే జాబిల్లి రావే
జో అచ్యుతానంద జోజో ముకుంద
అంటూ జాలువారిన అమ్మల నోట
ఆణిముత్యాలు అన్నమయ్యచలవే!
భక్తి రసాల భాసిల్లినా
శృంగారాల శోభించినా
భావలాలిత్యాల బంధించినా
వేల సంకీర్తనల వెన్నపూస !
సరళమైన పద సంపదల
సన్నుతించె పదకవితలు
సంకీర్తనల లక్షణాల కూడిన
సంస్కృత గ్రంథ రచన గావించె!
వేంకటేశ్వరుని కీర్తించినా
నారసింహుణ్ణి స్తుతించినా
ఆరుకోట్ల తెలుగువారిని
అలరించిన గుండె చప్పుళ్ళు !
నగునూరి రాజన్న
No comments:
Post a Comment