వేయి పడగలు
తేది: 27-05-2020
శీర్షిక: అపురూప కావ్యం ....
విశ్వనాథుడి విరాట్ రూపం....
సంఖ్య: 429
అవనిని మోస్తున్న
ఆదిశేషునిలా భాషలో
వెలుగొందిన బంగారు ఆభరణం...
ఆశువుగా ప్రవచించిన
అపురూప కావ్యం ....
ముచ్చటగొలిపే ముప్పాదారు
ఆధ్యాయముల ముదములు
వెదజల్లిన స్వీయానుభవాల
సాహితీ సమున్నత కుసుమం...
ఆచార సంప్రదాయముల
అస్తరు పన్నీరు వాసనలు
విద్య వైద్యముల విద్వత్తు
కళల ధర్మాల కాణాచి .....
ముక్కోటి దేవతలు
ఒక్కటై నిలిచి ఒనగూర్చిన
ముద్దు మురిపాల దీవెనలే
ముమ్మూర్తులా మన వేయిపడగలు....
పలు భాషలకది
పలుకుబడి అయ్యె
అనువదింబడి ఆరాధింపబడె ...
పలువురి శోధనలకది
పరిపాటి అయ్యె
పట్టభద్రులుగ తీర్చి దిద్దంగ....
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment