Thursday, July 9, 2020

కష్టకాలంలో నిజమైన మనిషి 13-05-20

కష్టకాలంలో నిజమైన మనిషి 
తేది: 13-05-2020
శీర్షిక: పుటం పెట్టిన బంగారం 
సంఖ్య: 417

కష్టాల కొలిమిలో కాకలు తీరితేనే
పుటం పెట్టిన బంగారంలా
పునీతమై నిలిచేది మెరిసేది.... 

కడగండ్లను దిగమింగితేనే
కనికరించబడ్డ భక్తుడిలా 
కీర్తి ప్రతిష్టలు పొందేది.....

స్వార్థాల బరువులు దింపుకుని
తండ్లాటల తాకులు తింటేనే
తరాలు మారినా తలుచుకునేది..... 

వరుస వైఫల్యాల మూటలతోనే 
వడి కలిగిన నడక నేర్చుకునేది 
వాడి ఆలోచనలకు నాంది పలికేది.... 

తుఫాను తాకిడికి ఎదురీదినప్పుడే
తపనల తనువులు రాటుదేలేది
తమాయించుక నిలబడగలిగేది....

నిట్టెండలో నిలబడగలిగితేనే 
నీలో మెలనిన్ ఇనుమడించేది 
వాతానుకూలంగా మలుచుకునేది.... 

అనుభవాలు ప్రోది చేసుకుంటేనే 
అవలీలగ జీవనసాగరమీదగలిగేది... 



కష్టం కాలానికే కాదు 
కష్టపడ్డ మనిషైనా 

No comments:

Post a Comment