కొత్తకోణం
తేది: 08-06-2020
శీర్షిక: గెలుపు బాణం
సంఖ్య: 438
కాలమెప్పుడు స్థిత ప్రజ్ఞతే
కోతినుండి పుట్టిన మానవునికి
కొత్త ఆలోచనలతో సతమతమవుతూ
ఎప్పుడూ మోజు పడుతూనే ఉంటాడు...
తాతల తరాలు మారగానే
పౌత్రుల తలపులు మారి
పాత ఒక రోత కొత్త ఒక వింతగా
ఫరిడవిల్లి నూతనత్వానికై ఉవ్విళ్ళూరుతుంది....
పాత ఒక రోత కొత్త ఒక వింతగా
ఫరిడవిల్లి నూతనత్వానికై ఉవ్విళ్ళూరుతుంది....
భూమి గుండ్రమన్నంత సత్యంగా
కొత్తల కోసం పరుగులు తీస్తూ జనం
పాతలను కూడా కొత్తగా స్వీకరించి
మోకరిల్లిన దినం కూడా లేకపోలేదు....
కొత్తల కోసం పరుగులు తీస్తూ జనం
పాతలను కూడా కొత్తగా స్వీకరించి
మోకరిల్లిన దినం కూడా లేకపోలేదు....
పాత పునాదులై నిలిచినవే చాలా
కొత్తలకు అవకాశం ఆకారమేర్పడేది
అమాంతం ఆకాశం నుండి ఊడిపడే
ఊహా చిత్రాలు విచిత్రాలు కానేకావు....
సనాతనాన్ని సంకేతంగా మలుచుకుని
మేథోమథనపు భావ సుగంధాలను జోడించి
నూతనాధ్యాయాల భవంతులకు శ్రీకారం చుడితేనే
కాలానుగత అవసరాలు అందుకునే గెలుపు బాణం...
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment