Sunday, July 12, 2020

పల్లె పిలుస్తున్నది తేది: 13-06-2020

పల్లె పిలుస్తున్నది
తేది: 13-06-2020
శీర్షిక: మనసు పెట్టి చూడరా... 
సంఖ్య: 441

పల్లె తల్లి పిలిచెరా
కన్న పేగుబంధం 
పడిగాపుల నిలుపకు
పద ముందుకు సోదరా // పల్లె//

పచ్చ కోక చుట్టుకున్న
పడుచు ముత్తైదువరా
పావురంగ పిలుస్తున్న
పసిడి మనసు చూడరా // పల్లె //

చేతి వృత్తులు చెదిరిపోయే
చేను చెలక వెంచరాయె
కూలి నాలి దొరకదాయే
కూడు కడుపు నిండదాయె // పల్లె //

అక్షరాస్యత నిండుగా 
అందరికి అందవాయె
ఆరోగ్యములు మెండుగా
అవసరాలకు దొరకవాయె
                                              // పల్లె //
చెరువు కుంటలు నిండవాయే
చేన్లు దండిగా పండవాయె
భూసారపు పరీక్షలు
కాగితాలకే పరిమితమాయె
                                             / / పల్లె //
స్వాతంత్య్రపు జాడలు
ఎండమావుల నీడలు
కాలం చెల్లిన కామందుల
పల్లె చెరలు వీడవాయె
                                          // పల్లె //
అసలు కిటుకు తెలువదాయె
ఆపదలు తొలిగిపోవాయె 
మనసు పెట్టి చూడరా 
మమత నింపి చేయరా
                                       // పల్లె//

నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment