మోహ తిమిరం
తేదీ: 16/05 /2020
శీర్షిక : కంచికి చేరని కథలు...
సంఖ్య: 420
మత్తులు వదలని బిత్తరితనములో
అన్న పానీయాల పరిణామాలో
క్రమశిక్షణల కరువు కాటకాలో
సమయానుకూల సలహాల నిస్సహాయతలో !
సంప్రదాయాల సంగతులు మరిచి
సంస్కారాల సరాగాలు తప్పుతున్నవి..
పట్నవాసాలు పెచ్చరిల్లిపోయి
పక్కోడి గోడు కూడా పట్టించుకోని తీరు !
ఆత్మీయతలు విలువలు
అటకెక్కుతున్న దాఖలాలు
హాయి బాయ్ ల బతుకులు
పశ్చిమాల మోజుల పరితపనలు!
ఆశల పల్లకిలో ఊరేగుతూ
అత్యాశల గంపలు నెత్తికెత్తుకుని
సమయ సంధ్యలను దాటవేయిస్తూ
మోహ తిమిరాలను జయించలేక
కఠిన వాస్తవాలను స్వీకరించలేక
ఎన్నో కథలు కంచికి చేరలేకపోతున్నయి!
నగునూరి రాజన్న
కరీంనగరు.
No comments:
Post a Comment