Thursday, July 9, 2020

సజల నయనాలు తేది: 22-05-2020

సజల నయనాలు 
తేది: 22-05-2020
శీర్షిక: సైనికుడా వందనం  
సంఖ్య: 425

సంరక్షకుడైన సైనికుడా వందనం  

అనిర్వచనీయం నీ ఉద్యో ధర్మం 
అమరత్వం నీ త్యాఫలం... 

కన్న వారికి కట్టుకున్న వారికి 
కని పెంచే పిల్లలకు 
కడుదూరం నీ నివాసం.... 

కొండ కోనల్లో వాగు వంకల్లో
చిన్న చిన్న డేరాలతో 
కదలాడే నీ ఆవాసం .... 

సరిహద్దుల్లో  సదా నిలిచి
సున్నా డిగ్రీ  సెంటి గ్రేడైన 
ఆగని నీ పహారాతో.... 

ప్రజా సంక్షేమాలే పండుగ పబ్బం
దేశ శ్రేయస్సే ఉచ్వాస నిచ్వాస ....

కోటాను కోట్ల దేశ ప్రజలు 
ఆటు పోట్లను తట్టుకుని 
ఆదమరిచి నిదరోవడానికి ... 

అత్యవసర పరిస్థితులలో
పదలు  సంభవించినప్పుడు
ఆదుకోవడంలో నీవు చూపే చొరవ... 

అనిర్వచనీయం అత్మీయుడా  
సదా బాధ్యతలు నిర్వర్తిస్తూ 
సంయమనం పాటిస్తూంటే 
సాక్షర సన్మానంతో 
సజల నయనాల 
సెల్యూట్ సోదరా.... 


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment