Sunday, July 12, 2020

నీతో ఒక సుదీర్ఘ సంభాషణ - 05-06-2020

నీతో ఒక సుదీర్ఘ సంభాషణ 
తేది: 05-06-2020
శీర్షిక: మదుర భాషణలైతే.... 
సంఖ్య: 436

ఆశువుగా చెప్పినా అందరి మాట వినరు 
ఏవో కొందరివి తప్పా !
చాగంటి కోటేశ్వర రావుగారివైతే
చర్మమంతా చెవులు చేసుకుంటారు !

ఆధ్యాత్మికమైనంత మాత్రాన 
అన్ని ప్రవచనాలు ఆదరిస్తారా ....
ఘనమైన గరికపాటి వారిదయితే
గంటలకొద్దీ మనసు పెడతారు !

స్వాతంత్ర్య సమరమైనా ప్రజలు 
సన్నుతించి మాట విన్నది మాత్రం...
సత్య నిష్టా గరిష్ఠుడైన అహింసావాది
మోహన్ దాస్ కరంచంద్ గాంధీగారిదే ! 

దిమ్మ తిరిగే దేశభక్తి అంటే 
అబ్దుల్ కలాం గారి తర్వాతే ఎవరైనా ...
కడుపునిండా తినక పోయినా 
కంటినిండా నిదురపోక పోయినా 
కన్న ప్రతి కల దేశం కోసమే ..... 

ఎందరెందరో సేవలు చేసినా
ఎరుకపడింది మాత్రం
అల్బేనియాలో పుట్టిన
అపురూపమైన అమ్మ
మదర్ థెరిస్సా మాత్రమే.... 

నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment