Thursday, July 9, 2020

నవ్య రీతులు తేదీ : 20 -05 -2020

నవ్య రీతులు 
తేదీ : 20 -05 -2020 
శీర్షిక : నాగరికతకు నాంది 
సంఖ్య - 423  

అనుభవాల ప్రోదితో
అవసరాల దృష్టితో 
బంగారు భవిష్యత్తుకై బాటలు 
వేసేదే అసలు సిసలైన నవ్యత! 

ఊహల్లో నవ్యత చేతల్లో నవ్యత 
మనసులో నవ్యత మాటల్లో నవ్యత 
నడతలో నవ్యత నడకలో నవ్యత 
నలుగురు ఆమోద మోదముతో.... 
నవ్యతే నాగరికతకు మూలాధారం .... 

సనాతనాల సంప్రదాయాలు 
ఎన్ని ఉన్నా  అందుబాటైన వనరుతో 
అవసరానుగుణం కాలానుగుణం మార్పు..
నవ్యత ఎప్పుడూ చలన శీలమే ..... 

కాశీకి వెళ్లినవాడు కాటికి పోయిన 
సమం ఒకప్పటిమాట.... 
క్షణాలమీద పయనం 
తక్షణాల వ్యవధిన  దర్శనం... 
బస్సు రైలు కారు లేదంటే విమానం 
చేరే దారులు అనేకం చేతిలో నేడు...   

తరం మారగానే తరీక మారె కట్టు బొట్టూ .... 
నగుబాటు కానీ నవ్యతతో 
సర్దుబాటవుతూ సాగడమే 
జీవిత పరమార్థం సోదరా ! 

నగనూరి రాజన్న
కరీంనగరు. 

No comments:

Post a Comment