ఆకాశ దర్శనం
తేదీ : 18 -05 -2020
శీర్షిక: పంచభూతములందు పవిత్రం
సంఖ్య: 421
పంచభూతములందు
పవిత్రమై నిలిచిన ఆకాశం
పగలు రేయిలు పహారా కాస్తూ
ఫరిఢవిల్లుచున్నది పాలపుంతన....
ధరణీ మాతకు సైతం
దశదిశలా అల్లుకుని
దండి అండదండలనందిస్తున్నది
గగన కైవల్యమై......
సాగరం నీరు సంగ్రహించినా
మేఘమై గర్జించి వర్షించి
మేను పులకరింప జేసి
అంకురాలకు చేయూతలై
అచ్చంగా పచ్చల హారాలను
అలంకరింపజేస్తుంది అవనిమాతకు .....
అలుపులేని అక్షయుడైన
కాంతి రేఖల కరుణామయుడు
అజరామరంగా ప్రకాశిస్తూ ప్రసరిస్తూ
జీవరాశికి జవజీవాలనందిస్తుంది
అక్కడినుండే.....
నిశి తిమిరాలను చీల్చి చెండాడ
శశి వదనుని ముసి ముసి నవ్వులను
ముదముగ మానవాళికి అందించు
మురిపమైన కానుకగా ......
నగునూరి రాజన్న
కరీంనగరు.
No comments:
Post a Comment