Thursday, July 9, 2020

శత్రువుతో ప్రయాణం తేదీ: 01 -06 -2020

శత్రువుతో ప్రయాణం 
తేదీ: 01 -06 -2020
శీర్షిక: ఆత్మసాక్షి తో అనునయం. 
సంఖ్య: 432. 

సత్యయుగాన నాలుగున్న ధర్మ పాదం
త్రేతా ద్వాపర యుగాలు దాటుకుని 
గూనెద్దులా కుంటుతూ మెంటుతూ 
కలిలో కూలబడటానికి సిద్దంగా 
కూని రాగాలు తీస్తున్నది.... 

జీవితమంటేనే కలి మాయల చదరంగం 
అనుచరగణాల ఆత్మీయ పలకరింపులు 
ప్రతిపక్షాల చిటపటల చిందులాటలు 
పడినా లేచినా తప్పని జీవన ప్రయాణం.... 

పల్లెనయినా పట్నమయినా 
పట్టు తప్పుతున్న పాలనలు
పైసున్నోడిదో బలగమున్నొడిదో
పట్టు బెట్టు...పంచాయతీలోనైనా 
పార్లమెంటులోనైనా ... 

ఆత్మసాక్షి అంగీకరించక పోయినా 
పక్కలో పాములా పాకిస్తానుతో 
మనమయినా..... 
నక్కి కాటేసే తిక్క కరోనాక్రిమితో
విశ్వమయినా .... 
తప్పని ప్రయాణం శత్రువుతో
చావో రేవో  జీవించడమే ప్రతివారి ధ్యేయం.... 
స్వీయ నియంత్రణలే జీవన ఉపకరణాలు... 

నగునూరి రాజన్న
కరినగరము. 


ఇరువది లక్షల అంతర్జాతీయ 
ప్రయాణీకులను విచ్చలవిడిగా వదిలేసి 
నూటముప్పై కోట్లమందిని విధిగా 
నిర్బంధించిన నేతిబీర చట్టాలు.... 

No comments:

Post a Comment