నేనేం చేయనూ...
తేది: 08-07-2020
శీర్షిక: కలి రాజకీయం....
సంఖ్య: 460
కలిధర్మం ఒంటి కాలు పోరాటం చేస్తుంటే
ప్రజాస్వామ్యం నాలుగు స్తంభాలాటలో
అధికార ప్రతి పక్షాల వంతులవారీ అలకల
తలమునకల తండ్లాటల పోలికేకల్లో
రొద చేస్తూ గోల గోలగా ఘొల్లుమంటుంటే.....
కల్తీ పాలనురగల రాజకీయ ధవళ వస్త్రదారులు
కబోది అధికార్ల కార్యదీక్షల కబంధహస్తాలు
కళ్ళు మూసుకున్న న్యాయ సువార్తల సుమహారాలు
ప్రజల గొంతంటున్న పక్కా వ్యాపార నీతి పత్రికలు....
ప్రణాళికలతో హోరెత్తిస్తూ...
ఫలితాలందకుండా జాగ్రత్తపడుతుంటే....
రాజ్యాంగమే రక్షణ గొడుగై నిలువంగ
చట్టాలన్నీ ఉన్నోళ్ల చుట్టాలవుతుంటే
చేవ లేని జన సామాన్యుడు చెదలు
దులపాలని అప్పుడప్పుడు అరిచి
గీపెట్టినా....అరణ్య రోదనవుతుంటే....
గొడుగులు మార్చుకుని ఊసరవెళ్ళులై
ఉచ్చ నీచములు మరచిన పొరుగులతో
ఉనికి పోరాటాల సైనికుల కవాతుల్లో
ఊపిరాడక కుత్తుకలు తెగి పడుతుంటే
రంగులు మార్చుకుంటున్న ప్రతిపక్ష రాజకీయం
రట్టడి తనం నెత్తికెతుకుంటుంటే.....
నల్లేరుపై నడకలా నలుబదేండ్లు
కళంకితం లేని దేశసేవకంకితమైనా....
మంచితనమనే గజ్జె మెడలో తగిలించుకుని
ఆర్డరేసె అధికారం లేని ఆమ్ ఆద్మీగ
నేనేం చేయను.....
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment