Thursday, July 9, 2020

మే 30 తదుపరి ఇంకొక లెక్క....

నగునూరి రాజన్న
శీర్షిక : మే 30  తదుపరి ఇంకొక లెక్క.... 

నల్లేరుపై సాగిన నడక గత తరుణం
ఆకస్మిక నిరోధం.. కరోనా కుదిపిన జీవనం 
వుహాను ఛాయల ఉనికి చిత్రంతో
ఊహలన్నీ తలకిందులమయం.... 

మే 30 వరకు: 
పాలకుల లాక్ డౌన్ తో కొంత ఊరట 
వీధిన కొంత నిరోధిస్తున్న రక్షక దళం 
విధిలో కొంత గెలిపిస్తున్న వైద్యుల కష్టం 
విరామమెరుగని సకల పారిశుధ్యం... 

మే 30 .....ఆపైనే.... అసలు మంత్రం
తదుపరంతా తమాషా చిత్రం 
తమకు తామే ఓ పెద్ద చాదస్తం 
ముట్టుకుంటే మూడు పట్టుకుంటే పదంటూ  
దోబూచులాటల నిత్య చోద్యం...... 

అడుగు తీసి అడుగు వేయాలన్న 
అసలు నమ్మం మన నీడను సైతం 
పక్కవారిని పలకరించాలన్నా 
పలు రకాల ఆలోచిస్తం....సుమా...

ఆటో  టాక్సీ  బస్సు  రైలు విమానం 
ఏదెక్కినా చచ్చేంత అనుమానం 
ఎక్కకపోతే గడవదు నిత్య జీవనం 
మనకు మనమే విధించుకోవాల్సిన పరిక్రమం ..... 

ఇనుమడించుకో రోగ నిరోధకం 
ఇమ్మడించుకో దైవ చింతనం 
కొంతైనా విడనాడుదాం స్వార్థం 
పొరుగు క్షేమం పొందు లాభం.....  

అత్యవసరానికే అమలు పయనం 
పనిగా ధరించు నిత్య  నాసిక  కవచం 
పక్కాగా పాటించు ప్రతివారితో దూరం 
పదేపదే తదుపరి చేసుకో పరిశుభ్రం...... 
స్వీయ నియంత్రణలే నీకు శ్రీరామ రక్ష... 

నగునూరి రాజన్న 
కరీంనగర్

No comments:

Post a Comment