Thursday, July 9, 2020

మళ్ళీ ప్రకృతి ఒడిలోకి 14-05-2020

మళ్ళీ ప్రకృతి ఒడిలోకి
తేది: 14-05-2020
శీర్షిక: మరవాలి మనమంతా... 
సంఖ్య :  418

వెచ్చని మట్టి వాసన లేని జీవితాలు 
పచ్చని చెట్టు పొడ తాకని  బతుకులు
విహంగాలకే పోటీగ ఆకాశహార్మ్యాలు
వింత కపోతాల గూళ్ళ నివాసాలు ....!

పాలకుల ప్రమాణాల ప్రణాళికలో 
ప్రజల అనాయాసాల మోజులో 
పథకాలన్నీ ఫక్తు నగరాల పరిసరాలకే
నరకప్రాయపు మైళ్ళ పయనాలు.... !

పారిశ్రామికీకరణ కేంద్రీకృత ఫలితాలో
పల్లెలన్న పాలకుల చిన్న చూపులో
మోతాదులు దాటుతున్న కాలుష్యాలు
మొత్తుకుంటున్న వాహనాల శబ్దాలు...!



అవసరాల ఆసరలో దళారీల జోరు
అవతలవారి కొరకనే ఆశల మహమ్మారి
వాణిజ్య నీతుల వరసమార్చిన కల్తీలు
స్వార్థాలను సంకనెత్తుకున్న సంకరలు.... !

పసకవాసనల పాడి జాడలకు 
పట్టుతేనెల బుట్ట రుచులకు 
పంట తోటల ప్రాణవాయువులకు
పరితపించని ప్రాణి ఎవ్వరో చెప్పండి... ?


నగునూరి రాజన్న
కరీంనగర్. 

No comments:

Post a Comment