మొగ్గ విచ్చుకుంటున్న చప్పుడు
తేది 12-06-2020
శీర్షిక : సహజరీతి...
సంఖ్య : 440
సృష్టిలోన జరుగు బహు సుందరాలు
సహజరీతిన నిత్యకృత్యమైన వేనవేలు
విచ్చుకున్న మొగ్గ చప్పుడు వింతగా
విశ్వమెరుగు కదా వివిధ రీతుల .....
కమలమైతే దినకరుడు
కలువలైతే చంద్రుడు
అన్ని పూలకు ప్రత్యక్ష సాక్ష్యం
అమ్మలాంటి ఆ ప్రకృతే కదా ...
మొక్క నీకు చెబుతుంది
మౌనంగానే ఎదగమని
పూవు సైతం విచ్చుకుంటుంది
తావికి కూడా వినపడకుండా ....
పూవు సైతం విచ్చుకుంటుంది
తావికి కూడా వినపడకుండా ....
ప్రకృతిలోని ప్రతీది పవిత్రమైన గురువులే
పబ్బతి పట్టి మనిషి నేర్చుకుంటే
పబ్బతి పట్టి మనిషి నేర్చుకుంటే
పట్టుదల దీక్ష క్రమశిక్షణలే
పెట్టుబడి లేని సాధనాలు....
సాధించాం నాగరికతంటూ
సహజాలను అడుగడుగున చేధిస్తే
సంక్రమించే సవాలక్ష సంకటాలకు
సమాధానాలు లేని సంశయాలవుతాయి....
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment