గోరింట పూలు
తేది: 08-05-2020
శీర్షిక: గడ్డిపూలు
సంఖ్య : 413
ముద్దలు రిక్కలటంచు గుత్తుల
మువ్వన్నెల పూలు ముదముగొలుపు
ముంగిట శోభనిచ్చు ప్రతి ఇంట
ముదావహమే ముదితలకు గోరింట ...
శరదృతువున పుంఖాను పుంకాలు
అన్ని రంగుల అలరించే గోరింటలు
ఎర్రరంగు ప్రత్యేకం గోరింటకు అందం
ఏపుగా పెరిగిన గడ్డి పూల ఆనందం....
అందమైన పూవులే గాని
అలంకరణకు నోచుకోలేదు
గర్భగుడి గడప దాటదు
గట్టిగా రావు పడతుల తలలకు...
పుట్టిన ప్రతి ప్రాణికి
పుణ్యమార్గమున్నట్టే
బతుకమ్మ పది రోజులు భలే
శోభనిచ్చి బతుకంత తృప్తిపడు...
పండగైనా పబ్బమైనా
ఇబ్బడిముబ్బడే ఆకులు పూలు
ప్రకృతికే పబ్బతి ఆనవాయితీ
భారతీయతకు దక్కిన గర్వకారణం...
నగునూరి రాజన్న
హైదరాబాదు.
No comments:
Post a Comment