Sunday, July 12, 2020

మిడతల దండు తేది :02-07-2020

మిడతల దండు 
తేది :02-07-2020
శీర్షిక : మద్దెల వాయింపు... 
సంఖ్య : 456

ఆరుగాలం శ్రమించే హాలికునికి 
విత్తనాలు మొదలు విషపు ఛాయల
క్రిమిసంహాకారాలు, అతివృష్టి అనావృష్టి
పంటల ధరలో కనీస మద్దతుకు
కూడా నోచుకోని కష్టాల కడలే రైతన్నకు
దక్కిన బహుమానం మిత్రమా....

మనిషి అలసత్వపు ఆనవాల్లో 
పాలకుల స్వార్థ కబంధ హస్తాల కోరలో
పని కట్టుకుని ప్రతి ఫలిస్తున్న
పర్యావరణ కలుషితాల మహిమలో... 

ప్రకృతిలో పల్లవిస్తున్న పదనిసలో
మచ్చుకైన కానరాని మానవత్వపు
ఛాయ లేని శతృవుల కపటనీతులో 
గ్రహకూటముల పరోక్ష వక్రదృష్టో 
కడుపు కొట్టే కలి ధర్మపు ఆనవాల్లో.... 

ఉన్నయి చాలవంటు ఉరుము
మంగళం మీద పడ్డ చందంగ
ముంచుకొచ్చే మేఘమోలె
ముసురుతున్న నీలినీడలు
కష్టాలకు అసలు చిరునామా 
కల్లాకపటం తెలియని మన రైతన్న.....

ఉప్పెనై ముంచుకొస్తున్న మిడతలదండు...
మద్దెల వాయింపులా మారబోతున్న
మన ముద్దుల రైతన్న బతుకు... 
ప్రశ్నార్థకం కాబోతున్న మనిషి జీవితం .... 

నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment