Thursday, July 9, 2020

కరోనా మంచిదే.... 16

శీర్షిక: కరోనా మంచిదే.... 


కరోనా మంచిదే.... 
కష్టాలు తెచ్చినా కళ్ళు తెరిపించింది
కొంత మేలు కూడా చేసింది 

దుమ్ము ధూళిని దులిపింది 
నేలమ్మకు మంచిదయింది 
కాలుష్యాలను తగ్గించింది 
కదిలే నీటికి మంచిదయింది.... 

వాహనాలు పరిశ్రమలను నిలిపింది 
వాయుకాలుష్యం తగ్గింది 
పరిశుభ్రతలకు పట్టం కట్టింది 
పరిపుష్టం చేసింది ఓజోనును.....

స్వల్పవిరామం ఇచ్చింది 
సదాచారాలను గుర్తు చేసింది
సంస్కృతిని నిలబెట్టింది.... 

ఉన్న ఊరికి పయనం చేసింది 
ఆత్మీయతలను గుర్తు చేసింది 
అవినీతిని కొంత అరికట్టింది ... 

సంపదలన్నీ మిధ్యే అన్నది 
సచ్ఛీలతలను చాటింది  
ధార్మికతలను ఆవిష్కరించింది... 

ప్రళయ సంకేతాలు పంపింది
పద్దతిగా మసులుకోమన్నది
ప్రకృతియే పరమ శ్రేష్టమన్నది.... 

జవసత్వాలుడుగుతున్న పట్టణ
పర్యావరణానికి జనసంచారం 
తగ్గి ఔషధమే అయ్యింది 

A రాంకిషన్


No comments:

Post a Comment