వాస్తవ రేఖలు
తేది: 04-06-2020
శీర్షిక: ఏ బంధమైనా....
సంఖ్య: 435
మనిషి పుట్టుకే మమతల పందిరి
మల్లె తీగలా అల్లుకునే
బంధాల సుందరి
మాట మాట పెరిగిందో
మనసులు విరిగి పరుగో పరుగు!
అమ్మ నాన్న అన్న తమ్ముడు
అక్క చెల్లెల్లు అన్నీ సుకుమారాలె
అల్లుకుంటే బలపడతాయి
కసురుకుంటే విరుచుకపడతాయి!
చెట్లు చేమ పుట్టలు కొండా కోనలు
అగ్ని భూమి ఆకాశం గాలి నీరు
ప్రకృతిని పంచుకునే వాదనలేల
మనమంతా వాటి ఆధీనులమే!
అశాశ్వతమైన శరీరాలకు
శాశ్వతమైన వనరులకు
సంబంధం శాశ్వతమా? అశాశ్వతమా?
సంధించుకుంటే సమాధానమౌతుంది !
ఆలోచిస్తే అన్నీ సృషించవచ్చు
అనిర్వచనీయం పరిధిలో నిలిస్తే...
ఆనందాలు వెల్లి విరుస్తుంది అవధిలో
అధిగమిస్తే అఘమేఘాలే నీలి నీడలే...
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment