అక్షర గవాక్షం
తేది: 09-07-2020
శీర్షిక: పరిమళించాలని....
సంఖ్య: 461.
అక్షరాస్యత ఓం ప్రథమంగా అమ్మ భిక్షే
అయినా అలుపు ఆటంకాలు లేకుండా
అడుగులేయడం తొలి గురువుల దీవనలే .....
ఉదర పోషణార్థం ఉద్యోగం
కేంద్ర ప్రభుత్వ సంస్థలో అయినా
పారిశ్రామిక నినాదాల పరుగు పందెములో
ప్రథమ ద్వితీయాలు పదిలపరుచుకుంటూ....
వైవిధ్యమైన వ్యాస రచనల వ్యాపకంతో
అడుగిడిన అన్ని సందర్భాలలో
ఆధిపత్యం ప్రదర్శిస్తూ అమ్మభాషపై
ఆత్మీయతతో అల్లుకున్న తీగనయ్యాను ....
పర్యావణపు లోటుపాట్లను పట్టుకుని
ప్రకృతి పచ్చదనం పరిరక్షణలను ప్రవచిస్తూ
నాణ్యత రక్షణల్లో సుశిక్షితుడనవుతూనే
విజిలెన్సులో వీర జవానునై
నీరు విద్యుచ్ఛక్తిల నింపాది నిలకడలకు
అక్షర నీరాజనాలను అలంకరిస్తూ సంధిస్తూ
పారిశ్రామిక త్రైమాసిక ప్రత్యేక పేజీలో
ప్రతి జ్యోతివాణిలో ప్రత్యక్షమయ్యాను....
పదవీ విరమణ ప్రశాంతతలతో
నేటి కవితా గురువుల ఊతములతో
మేటి పద సంపదల పరిమళిస్తూ
వాసి కవితల గుభాళించాలని...ఆకాంక్ష
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment